మధిర, జులై 05 : చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ప్రమాదవశాత్తు మున్నేరులో పడి అన్నదమ్మలు కాశీమల్ల నాగ గోపి, నందకిశోర్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాధ సంఘటన తెలిసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మృతుల కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. జరిగిన సంఘటనపై మృతుల తండ్రి కాశీమల్ల చిన్న వెంకటిని వివరాలను అడిగి తెలుసుకుని మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, వీరబాబు, ఏడుకొండలు, లక్ష్మీనారాయణ, చింతకాని, పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు.