ఖమ్మం/ ఖమ్మం లీగల్, నవంబర్ 22 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11గంటలకు ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)కు వచ్చారు. ఆయనతోపాటు మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తదితరులు ఉన్నా రు. హరీశ్‌రావును కలిసేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకు కార్యకర్తలు, నాయకులు ఉత్సాహం చూపా రు.
ప్రతి కార్యకర్తతో కరచాలనం చేస్తూ ఉద్యమకారులను, పరిచయం ఉన్న నాయకులను, కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించారు. వారి కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంచి రోజులు రానున్నాయని, ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసులకు భయపడాల్సిన పనిలేదన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వమ్ముచేశాడని, కాంగ్రెస్‌కు ఓటువేసిన ప్రజలే ఛీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ నాగభూషణం, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బొమ్మెర రామ్మూర్తి, బెల్లం వేణు, ఎడ్లపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.
భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ ఆధ్వర్యంలో హరీశ్‌రావును న్యాయవాదులు కలిసి వినతిపత్రం అందజేశా రు. ఖమ్మం జిల్లా కోర్టులో ఉన్న నాన్ క్యాడర్ పోస్టులను క్యాడర్ పోస్టులుగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనివల్ల కక్షిదారులకు తక్షణ న్యాయసహాయం అం దదని తెలిపారు. నాన్ క్యాడర్ పోస్టులను పూర్తిచేయకపోవడం వల్ల న్యాయవాదులు, పోలీసులతోపాటు కక్షిదారులకు ఇబ్బంది కలుగుతున్నదని విన్నవించారు. న్యాయవాద రక్షణ చట్టంని అసెంబ్లీలో ప్రవేశపెట్టే విధంగా చూ డాలని హరీశ్‌రావును కోరారు. కార్యక్రమంలో బిచ్చాల తిరుమలరావు, కొత్త వెంకటేశ్వరరావు, సుగుణరావు, దిలీప్‌చౌదరి, నిరోషా, షేక్ మల్సూర్ పాల్గొన్నారు.