రఘునాథపాలెం, ఫిబ్రవరి 8 : నమ్మకానికి, నాణ్యతకు చిరునామాగా ‘లలితా జ్యువెల్లరి’ రెండు తెలుగు రాష్ర్టాల్లో పేరొందిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖమ్మం నగరంలో లలితా జ్యువెల్లరి 60వ షోరూం ప్రారంభమైంది. వైరా రోడ్డులో ఏర్పాటు చేసిన నూతన షోరూమ్ ప్రారంభోత్సవానికి మంత్రులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. లలితా జ్యువెల్లరిని స్థాపించి ఉమ్మడి రాష్ర్టాల్లో సంస్థ అధినేత డాక్టర్ యం.కిరణ్కుమార్ అందిస్తున్న సేవలను వారు ప్రశంసించారు. 41ఏళ్లకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థగా లలితా జ్యువెల్లరి నిలిచిందన్నారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాల ప్రజలకు ఖమ్మంలో అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారు అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రులకు లలితా జ్యువెల్లరి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్కుమార్ షోరూమ్ మొత్తం చూపించి అందుబాటులో ఉన్న పలురకాల వెరైటీ బంగారు, వజ్రాభరణాల గురించి వివరించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన పథకాలను తీసుకొచ్చినట్లు విలేకరుల సమావేశంలో కిరణ్కుమార్ వెల్లడించారు. తయారీ ధరకే బంగారు, వజ్రాభరణాలు అందించేందుకు లలితా జ్యువెల్లరి సిద్ధంగా ఉందన్నారు. నగల తయారీ సంస్థలో తమ కు 41ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని పేర్కొన్నారు. తక్కువ తరుగు, లైట్ వెయిట్లో నగలు, లలితా వారి వందనం 11నెలల నగల కొనుగోలు పథకం వంటివి షోరూంలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా పాల్గొన్నారు.