బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
మండలంలోని ఇస్లావత్ తండా భక్తరామదాస్ ఎత్తిపోతల పథకం నుంచి గురువారం కృష్ణా జలాలు విడుదలయ్యాయి. ఈ నీటితో కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని శ్రీరాంసాగర్ కాలువల ద్వారా జలాలు 79 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. చెరువులు నిండే అవకాశం ఉన్నది.
- యాసంగికి భక్తరామదాస్ ఎత్తిపోతల జలాలు
- 79 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలం
తిరుమలాయపాలెం/ కూసుమంచి రూరల్, డిసెంబర్ 29: మండలంలోని ఇస్లావత్ తండా భక్తరామదాస్ ఎత్తిపోతల పథకం నుంచి గురువారం కృష్ణా జలాలు విడుదలయ్యాయి. ఈ నీటితో కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని శ్రీరాంసాగర్ కాలువల ద్వారా జలాలు 79 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. చెరువులు నిండే అవకాశం ఉన్నది. దీంతో యాసంగిలో పంటల సాగుకు సాగునీటి ఇబ్బందులు తప్పాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి చొరవ తీసుకుని నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి జలాలు తొందరగా విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. రైతులు వరి సాగుకు సమాయత్తమవుతున్నారు. బుధవారమే నీటిని విడుదల చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో ఒకరోజు ఆలస్యమైందని తెలిసింది. ఎత్తిపోతల ద్వారా పదిరోజుల పాటు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదలశాఖ డీఈఈ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి పాలనలో యాసంగిలో వరి సాగు చేసేవారమే కాదని, తెలంగాణ వచ్చిన తర్వాతే ఏడాదిలో రెండు పంటలూ వరి సాగు చేయడం సాధ్యమైందని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది. భక్తరామదాస్ ఎత్తిపోతల పథకంతో పాలేరు బెల్టు కోనసీమను తలపిస్తున్నదని అభిప్రాయపడుతున్నది.
కల్పతరువు ఎత్తిపోతల..
భక్తదరామదాస్ ఎత్తిపోతల పథకం కరువు ప్రాంత రైతుల పాలిట కల్పతరువుగా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాతే పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. మేం ఏటా రెండు పంటలు పండిస్తున్నాం. యాసంగి సాగుకు ముందుగానే జలాలు విడుదల కావడం భరోసానిచ్చింది.
– వంచర్ల సత్యనారాయణరెడ్డి, రైతు, బీరోలు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

