Theerthala Jathara | ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లాలో ఈ నెల 25న ప్రారంభం అయ్యే తీర్దాల సంఘమేశ్వర స్వామి జాతరకు ఎలాంటి చిక్కులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఖమ్మం డివిజన్ ఆర్డిఓ జీ నరసింహారావు సంబంధిత అధికారులను అదేశించారు.
సుప్రసిద్ధ సంగమేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవాల సంబంధించిన సమావేశం ఇవాళ ఖమ్మం ఆర్డీవో నరసింహారావు అధ్యక్షతన జరిగింది. తీర్థాల గ్రామంలోని సంగమేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత అధికారులు సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
పంచాయతీ రాజ్, ఎక్సైజ్, పోలీస్, దేవాలయ శాఖ, ఆర్టీసీ తదితర శాఖల అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈనెల 25 నుంచి జాతర మహోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మౌలిక వసతులు, రవాణా, పారిశుద్ధ్య, విద్యుదీకరణ తదితర ఏర్పాట్లను ముమ్మరం చేయాలని దిశా నిర్దేశం చేశారు.
జాతరకు వచ్చే ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని ఆదేశించారు. రెండు రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, దేవాలయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి మండల తహసిల్దార్ ఈ రాంప్రసాద్, ఎంపీడీవో ఎస్ కుమార్, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ముస్కారాజ్ దేవాలయం ఈవో శేషయ్యతోపాటు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!