పాల్వంచ, సెప్టెంబర్ 21: మహిళల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మహిళల కోసం తెలంగాణలో అమలవుతున్నన్ని పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. పాల్వంచలోని గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ చీరెల పంపిణీలో ఆయన మాట్లాడారు. పండుగ పూట తెలంగాణ ఆడబిడ్డలు నూతన వస్ర్తాలు ధరించాలనే సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ చీరెలను ప్రభుత్వ కానుకగా అందిస్తున్నారని అన్నారు.
అలాగే, కొత్తగూడెం, పాల్వంచలను కలిపి జంట పట్టణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, చింతా శ్రీకాంత్, మురళి, కిలారు నాగేశ్వరరావు, బరపటి వాసుదేవరావు, మడి సరస్వతి, మంతపురి రాజుగౌడ్, కాల్వ ప్రకాశరావు, మహిపతి రామలింగం, కాంపెల్లి కనకేశ్, ఆచార్యులు, చింతా నాగరాజు, బండి చిన్న వెంకటేశ్వర్లు, బానోత్ రాజ్య, మల్లెల శ్రీరాంమూర్తి, పూసల విశ్వనాథం, జూపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.