వైరా/ వైరా టౌన్, సెప్టెంబర్ 21: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. వైరాలోని ఎన్వీఎస్ గార్డెన్లో తహసీల్దార్ అరుణ అధ్యక్షతన బుధవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాలూ ప్రశంసిస్తున్నాయని గుర్తుచేశారు.
ఏన్కూరు మండలంలో బుధవారం పర్యటించిన వైరా ఎమ్మెల్యే రాములునాయక్.. హిమాంనగర్, ఏన్కూరు, గార్ల ఒడ్డు గ్రామాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.