చింతకాని, సెప్టెంబర్ 20: విద్యాశాఖ ప్రవేశపెట్టిన మౌలిక భాషా గణిత సామర్థ్యాల (ఎఫ్ఎల్ఎన్) విద్యాబోధనపై ఉపాధ్యాయులు పట్టుసాధించాలని, ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో యాదయ్య అన్నారు. తిర్లాపురం, తిమ్మినేనిపాలెం గ్రామాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మంగళవారం తనిఖీ చేశారు.
హాజరు శాతం, సంసిద్ధతా కార్యక్రమాలు, ఎఫ్ఎల్ఎన్ అమలు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల చేరికలు, బుక్ బ్యాంక్ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, వంట సిబ్బందికి వేతనాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. చిన్నారులు ఆంగ్లంపై పట్టు సాధించేలా కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట సీసీ మాధవరావు, హెచ్ఎంలు భిక్షం, అంబటి శాంతయ్య, రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.