కల్లూరు రూరల్, సెప్టెంబర్ 20 : ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం కల్లూరు మండలంలో పర్యటిస్తారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు తెలిపారు. ముగ్గు వెంకటాపురం, పేరువంచ, రఘునాధబంజరు, చండ్రుపట్ల, చెన్నూరు, ఎర్రబోయినపల్లి, యజ్ఞనారాయణపురం, ఓబులరావుబంజరు, ముచ్చవరం గ్రామాల్లో ఆసరా పింఛన్లు, చెక్కులను పంపిణీ చేస్తారని వివరించారు.
వేంసూరు, సెప్టెంబరు 20 : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం మండలంలో పర్యటించనున్నట్లు ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడుపాల వెంకటరెడ్డి తెలిపారు. నూతనంగా మంజూరైన ఆసరా గుర్తింపు కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు. మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొనాలని కోరారు.
ఎమ్మెల్యే సండ్ర పరామర్శ
పెనుబల్లి, సెప్టెంబర్ 20 : గంగదేవిపాడుకు చెందిన కాకా వెంకటేశ్వర్లు ఆయన అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద ఉన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఆయనను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు కనగాల వెంకట్రావు, కనగాల సురేశ్‌బాబు, చీకటి రామారావు, మందడపు అశోక్‌కుమార్, తీగల వెంకటేశ్వరరావు, కొత్తగుండ్ల అప్పారావు, కాకా సీతారాములు తదితరులు ఉన్నారు.
తల్లాడ, సెప్టెంబర్ 20 : నూతనకల్‌లో అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్ఎస్ నాయకుడు గణేశుల నరసింహారావు మృతదేహాన్ని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలగవరంలో ఇటీవల మృతిచెందిన గొల్లమందల రామారావు కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.