కారేపల్లి, మార్చి 1: కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మండలంలోని గేట్ కారేపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దేశానికి రోల్‌మోడల్‌గా గుర్తింపు పొందుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమానికి సీఎం కేసీఆర్ దిక్చూచిగా నిలుస్తున్నారన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో వివిధ పథకాలను ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్.. కారణజన్ముడని అన్నారు. అన్ని రకాల ఉపాధి అవకాశాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తులు ఖమ్మం నుంచి ఇల్లెందు మధ్య నడిచే బస్ సర్వీసుల్లో కొన్నింటిని లింగాల, కమలాపురం, మేకలతండా, గేట్ కారేపల్లి, కారేపల్లి మీదుగా నడిపించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. ట్రస్టు చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, సర్పంచ్‌లు కల్పన, ఆదెర్ల స్రవంతి, టీఆర్ఎస్ నాయకులు తోటకూరి రాంబాబు, వీరన్న, ఇమ్మడి తిరుపతిరావు, హనీఫ్, ఆదెర్ల ఉపేందర్, బత్తుల శ్రీనివాసరావు, రూప్లా నాయక్, షేర్, మత్రూ పాల్గొన్నారు.