తల్లాడ, సెప్టెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోలేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. మండలంలోని నూతనకల్, మల్సూరుతండా, రంగంబంజర, పాతమిట్టపల్లి, వెంగన్నపేట, రామచంద్రాపురం, కొత్త వెంకటగిరి, రేజర్ల, తెలగవరం, గొల్లగూడెం గ్రామాల్లోని లబ్ధిదారులకు నూతన పింఛన్ గుర్తింపు కార్డులతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి గురువారం ఎమ్మెల్యే సండ్ర పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని అన్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం 64 ఏళ్లు వచ్చాక మాత్రమే పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం 57 ఏళ్లకు మాత్రమే ఆసరా పింఛన్లు అందిస్తున్నారని అన్నారు. పింఛన్లు తీసుకున్న లబ్ధిదారులందరికీ గ్రామ పంచాయతీల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, నారపోగు వెంకటేశ్వర్లు, గంటా శ్రీలత, కొండపల్లి శ్రీదేవి, సురేశ్, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, తూము శ్రీనివాసరావు, మాగంటి కృష్ణయ్య, ఏడుకొండలు, నునావత్ కవిత, తేలపుట్ల కృష్ణయ్య, మాలోతు కల్యాణి, శీలం కోటారెడ్డి, దిరిశాల దాసురావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కేతినేని చలపతి, బద్ధం కోటిరెడ్డి, మువ్వా మురళి, నాయుడు శ్రీను, కోడూరి వీరకృష్ణ, శీలం శ్రీనివాసరెడ్డి, ఆదూరి వెంకటేశ్వర్లు, ఏపీవో కోటయ్య తదితరులు పాల్గొన్నారు.