తల్లాడ, ఫిబ్రవరి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనతో విద్యాబోధన మరింత మెరుగుపడుతుందని అన్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని హర్షిస్తూ ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తల్లాడలో సోమవారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండలంలోని నారాయణపురం నుంచి తల్లాడ హైస్కూల్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. సైన్స్‌డే సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ ఆర్వీ శేషగిరిరావుతో కలిసి సైన్స్‌ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలోనే 134 పాఠశాలలు ‘మన బడి’కి ఎంపికయ్యాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరంతరం కృషిచేయాలని సూచించారు. ‘మన బడి’లో దాతలు, పూర్వవిద్యార్థులు, ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు రూ.12 లక్షలతో అల్పాహారం అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి విద్యార్థులతో కలిసి పుష్పాభిషేకం చేశారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్తూరి ఉమామహేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, దామోదరప్రసాద్, రవీందర్‌రెడ్డి, శ్రీదేవి, రమాదేవి, చల్లా తిరుమలాదేవి, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, షేక యూసుఫ్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కేతినేని చలపతి, జీవీఆర్, రుద్రాక్షల బ్రహ్మం, నారపోగు వెంకటేశ్వర్లు, శీలం కోటారెడ్డి, జొన్నలగడ్డ కిరణ్‌బాబు, కోసూరి నరసింహారావు, ఓబుల సీతారామిరెడ్డి, తూము శ్రీనివాసరావు, నాయుడు శ్రీనివాసరావు, దూపాటి నరేశ్రాజు, కోడూరి వీరకృష్ణ, శెట్టిపల్లి లక్ష్మణరావు, కాంపాటి జమలయ్య, ఎక్కిరాల సుదర్శన్, గుండ్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ భారీ ముఖచిత్రం..
‘మన బడి’ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 240 అడుగుల విస్తీర్ణంలో సీఎం కేసీఆర్ ముఖచిత్రాన్ని ఏర్పాటుచేశారు. అందులో కింది భాగాన ‘నాటి బడి – నేటి బడి’ని పెయింటింగ్‌తో రూపొందించారు. ఈ భారీ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముందుగా నారాయణపురం నుంచి తల్లాడ హైస్కూల్ వరకు ఎమ్మెల్యే సండ్ర.. విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనకు ముందు భాగాన నారాయణపురం మహిళలు కోలాట నృత్యం ప్రదర్శించారు. సైన్స్ డే, సీవీ రామన్ జయంతి సందర్భంగా తల్లాడ హైస్కూల్లో రూ.7.20 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన సైన్స్‌ల్యాబ్‌ను ప్రారంభించారు.