సత్తుపల్లి, సెప్టెంబరు 8 : తెలంగాణ స్పూర్తిని చాటేలా ఈనెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 16న నియోజకవర్గ కేంద్రంలో అన్ని మండలాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి విద్యార్థులు, యువతీ, యువకులకు నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ, 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, మున్సిపల్, పంచాయతీ కేంద్రాల్లో అధికారులు జెండా ఆవిష్కరణలు, 18న స్వాతంత్య్ర సమరయోధులకు, కవులు, కళాకారులకు సత్కారాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో వీరేశం, కమిషనర్ సుజాత, ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకర్, ఆర్ఐ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు, సెప్టెంబరు 8 : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఈనెల 16, 17, 18 తేదీల్లో ఘనంగా నిర్వహించాలని తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, ఎంపీడీవో రవికుమార్ అన్నారు. మండల కార్యాలయంలో గురువారం జరిగిన అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో ఎస్సై వెంకటేశ్, ఎంఈవో దామోదరప్రసాద్, ఏపీఎం వెంకటరామారావు, సీడీపీవో కృష్ణకుమారి, జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, రైతుబంధు సమితి కన్వీనర్ లక్కినేని రఘు, అధికారులు పాల్గొన్నారు.