తల్లాడ, సెప్టెంబర్ 8 : తల్లాడ పట్టణానికి చెందిన దగ్గుల రాధిక రాష్ట్రస్థాయి ఉత్తమ లెక్చరర్‌గా హైదరాబాద్‌లో ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాధిక లంకపల్లిలో మహాత్మాజ్యోతిరావుపూలె వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం రాధిక, చంద్రశేఖర్‌రెడ్డి దంపతులను శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో నాయకులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, శీలం కోటారెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావు, దగ్గుల రాజశేఖర్‌రెడ్డి, రఘు, అప్పిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
తల్లాడ, సెప్టెంబర్ 8 : మిట్టపల్లిలో గురువారం మృతిచెందిన శ్రీరంగం శ్రావణ్ కుటుంబసభ్యులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు పరామర్శించారు. తొలుత శ్రావణ్ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్, ఏఎంసీ వైస్‌చైర్మన్ దూపాటి భద్రరాజు ఉన్నారు.
సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 8 : ఎన్టీఆర్నగర్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లు చిన్నం నాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎమ్మెల్యే సండ్ర గురువారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడు పనిచేసే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకున్నారు.
ఎర్రబోయినపల్లిలో మహా అన్నదానం
కల్లూరు రూరల్, సెప్టెంబర్ 8 : ఎర్రబోయినపల్లిలో యువనేత పోట్రు ప్రవీణ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరుకాగా ఆయనకు ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జోరువానలో స్వాగతం పలికి సండ్రపై పూలవర్షం కురిపించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, గ్రామస్తులు కొమ్మినేని నర్సింహారావు, పోట్రు రామకృష్ణ, బత్తుల రాము, నరేశ్, కొంగల లేహం తదితరులు పాల్గొన్నారు.