ఖమ్మం ఎడ్యుకేషన్/ రఘునాథపాలెం, ఫిబ్రవరి 28: విద్యార్థులు కేవలం తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని ఆచరణాత్మకంగా ప్రయోగించారు. తమ నూతన ఆలోచనలతో వివిధ ప్రయోగాలు చేసి ఉపాధ్యాయుల మన్ననలు పొందారు. సైన్స్ పట్ల వారికున్న విజ్ఞానం, మేధస్సు వారి ప్రయోగాల్లో వికసించాయి. వారి ప్రయోగాలు ఉపాధ్యాయులను సైతం ఆలోచింపజేశాయి. సీవీ రామన్ జయంతి అయిన జాతీయ సైన్స్‌డే సందర్భంగా వివిధ విద్యాసంస్థల్లో విద్యార్థులు ప్రయోగాలు చేశారు. అనంతరం సర్ సీవీ రామన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు.
విద్యాసంస్థల్లో..
షైన్ ఇండియా స్కూల్లో మేయర్ నీరజ, కార్పొరేటర్లు శరత్, రమా, చైర్మన్ సృజన్, ఉషారాణి, వేణు పాల్గొన్నారు. గీతాంజలి పాఠశాలలో టీవీ అప్పారావు, పద్మ, ఎస్వీఎం, సర్వజ్ఞ, రెజోనెన్స్ పాఠశాలలో రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, నీలిమ, కొండా శ్రీధర్‌రావు, శ్రీవిద్యానికేతన్‌లో గోల్లపూడి రామ్‌ప్రసాద్, త్రివేణిలో రాజేంద్రప్రసాద్, డాక్టర్ కూరపాటి ప్రదీప్, విన్ఫీల్డ్లో గద్దె పుల్లారావు, పోలవరపు శ్రీకాంత్, మన్నె కిశోర్‌కుమార్, నిర్మల్ హృదయ్‌లో సాంబశివారెడ్డి, పద్మజ, స్మార్ట్కిడ్జ్లో చింతనిప్పు కృష్ణచైతన్య, న్యూవిజన్లో చైర్మన్ సీహెచ్‌జీకే ప్రసాద్, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్య, సెంచరీలో కార్పొరేటర్ నీరజ, ప్రభాకర్‌రావు, హార్వెస్ట్ స్కూల్లో మేయర్ నీరజ, కార్పొరేటర్ ప్రశాంతలక్ష్మి, రవిమారుత్, పార్వతిరెడ్డి పాల్గొన్నారు. శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, కవితా మెమోరియల్ డిగ్రీ పీజీ కళాశాలలోనూ సైన్స్ డేని నిర్వహించారు. వేపకుంట్ల హైస్కూల్లో నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలను సీఎంవో రాజశేఖర్ పరిశీలించారు.