ఖమ్మం, ఫిబ్రవరి 28: దేశంలో అతిపెద్ద ఆన్లైన్ సూపర్ మార్కెట్‌గా పేర్గాంచిన బిగ్ బాస్కెట్ (టాటా ఎంటర్ప్రైజెస్) తన సేవలను విస్తృతపరుస్తూ ఖమ్మంలో మరో స్టోర్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో స్టోర్స్ ఏర్పాటై వినియోగదారులకు సేవలందిస్తుండగా తాజాగా ఖమ్మం నగరంలో స్టోర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు అందిస్తున్నది. సంస్థ యాప్ ద్వారా వినియోగదారులు నూనెలు, మసాలాలు, పర్సనల్ కేర్, బ్యూటీ, బ్రాండెడ్ ఫుడ్, కిచెన్, నిత్యావసరాలతో కూడిన విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. నేరుగా స్టోర్‌ను సందర్శించి నచ్చినవి తీసుకునే ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ‘బిగ్‌బాస్కెట్’ రీజినల్ బిజినెస్ హెడ్ హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. లక్షలాది మందికి బిగ్‌బాస్కెట్ నమ్మకమైన సంస్థ అని అన్నారు. టాటా గ్రూప్ సంస్థలో ఒకటిగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నదన్నారు. అతి తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తున్నదన్నారు. దాదాపు 20 వేలకు పైగా ఉత్పత్తుల ఎస్కేహెచ్లపై కనీసం 6 శాతం రాయితీ ఇస్తున్నదన్నారు. ప్రతిరోజు తక్కువ ధరలు అనే సిద్ధాంతానికి బిగ్‌బాస్కెట్ కట్టుబడి ఉందన్నారు.