పెనుబల్లి, జూన్ 8 : పల్లెప్రగతిలో చేపడుతున్న పనులన్నీ ప్రజలకు ఉపయోగకరమని ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో, చనిపోయిన మొక్కల స్థానంలో మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమాల్లో గ్రామాల సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
వైరా, జూన్8 : వైరా మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. కాలువల్లో పూడికతీత పనులు, రోడ్ల వెంబడి పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగింపు, విద్యుత్ సంబంధిత మరమ్మతులు తదితర కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామదీపికలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కారేపల్లి,జూన్ 8 : మండల వ్యాప్తంగా పల్లెప్రగతి పనులు బుధవారం ముమ్మరంగా కొనసాగాయి. సర్పంచ్‌లు, పంచాయతీ ప్రత్యేకాధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వేంసూరు, జూన్ 8 : గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం మర్లపాడులో పల్లెప్రగతి ద్వారా చేపడుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ మందపాటి వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి సురేశ్‌రెడ్డి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు, జూన్ 8 : కప్పలబంధంలో సర్పంచ్ నందిగామ ప్రసాద్ ఆధ్వర్యంలో పల్లెప్రగతి పనులు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి అనూష, ఉపసర్పంచ్ మందపాటి మాధవరెడ్డి, కార్యదర్శి నవీన్‌రెడ్డి, అంగన్వాడీ టీచర్లు భారతి, భవాని, హెలీనా, ఆశ కార్యకర్తలు, ఐకేపీ కార్యకర్త మైబు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.