
చింతకాని, సెప్టెంబర్ 4: టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తోందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. దళితబంధుతో ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని అన్నారు. మండలంలోని నరసింహపురంలో రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు సమక్షంలో కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీలకు చెందిన 50 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి.
వారికి ముగ్గురు చైర్మన్లు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై అనేక పార్టీల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మంకెన రమేశ్, జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, నాయకులు బండి రామారావు, ఆవుల నాగేశ్వరరావు, దొడ్డా ఉపేందర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిక: టీఆర్ఎస్ చింతకాని మండల నాయకుడు వంకాయలపాటి వెంకటలచ్చయ్య, సత్యనారాయణల ఆధ్వర్యంలో నాగులవంచ గ్రామంలో పలు పార్టీలకు చెందిన 10 మంది టీఆర్ఎస్లో చేరారు.