ఖమ్మం, మే 8: సమాజంలో మార్పు తెచ్చేందుకు జర్నలిస్టుల కలమే ఒక ఆయుధమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఆదివారం జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం నియోజకవర్గ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలను ఇప్పించే సంకల్పాన్ని తాను, సీఎం కేసీఆర్ తీసుకున్నామని పేర్కొన్నారు.
టీయూబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.రాంనారాయణ, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,. కార్పొరేటర్ కమర్తపు మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఎండీ జావెద్, సీపీఎం నాయకులు విక్రమ్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఖాదర్‌బాబా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్, వనం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు మొహినుద్దీన్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కుర్రాకుల గోపి, మాధవరావు, జనార్దనాచారి, ఉషోదయం శ్రీనివాస్, సామినేని మురారి, రాయల బసవేశ్వరరావు, ఆలస్యం అప్పారావు, జకీర్, కమటం శ్రీనివాస్, ఎం.నాగేందర్‌రెడ్డి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.