కారేపల్లి, మార్చి 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మంగలితండా పంచాయతీలో బుధవారం ఆయన పర్యటించారు. ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులను పర్యవేక్షించి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. గ్రామపంచాయతీకి ట్రాక్టర్లను కొనుగోలు చేయించి సిబ్బందితో నిత్యం చెత్తసేకరణ, హరితహారం ద్వారా నాటిన మొక్కలకు నీళ్లను పోసే కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సర్పంచ్లు, వారు ్డసభ్యులు ప్రజలను కలుపుకొని గ్రామవికాసానికి పాటుపడాలని సూచించారు. గ్రామ సమీప చెరువు మాదారం డోలమైట్ మైన్స్ క్వారీ నుంచి వృథాగా పోతున్న నీళ్లను సంస్థ యాజమాన్యంతో చర్చించి మళ్లించేందుకు కృషి చేయాలని సర్పంచ్ పిల్లలమర్రి స్వర్ణ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. తొలుత స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం రోడ్డుప్రమాదంలో గాయపడిన దివ్యాంగుడిని, ఇటీవల మృతి చెందిన పిల్లలమర్రి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, సంత దేవాలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుగులోత్ శ్రీను, మాలోత్ కిశోర్, అజ్మీరా నరేశ్, హనీఫ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.