ఖమ్మం, అక్టోబర్ 8: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్పొరేటర్లు శనివారం మునుగోడు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని మంత్రి నివాసం నుంచి వారు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా బచ్చు విజయ్‌కుమార్, పగడాల నాగరాజు మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశం మేరకు తాము మునుగోడు మండలం కోరిత్కల, దుబ్బాక గ్రామాల్లో ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. మంత్రి పువ్వాడను కోరిత్కల గ్రామానికి ఇన్చార్జిగా నియమించారని, ఆ గ్రామంలో ఎన్నికలు ముగిసే వరకు తాము అక్కడే ఉండి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి విజయానికి కృషి చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అక్కడి ఓటర్లను అభ్యర్థిస్తామని అన్నారు. మునుగోడు తరలి వెళ్లిన వారిలో కార్పొరేటర్లు రాపర్తి శరత్, జ్యోతిరెడ్డి, మేడారపు వెంకటేశ్వర్లు, నాయకులు కన్నం ప్రసన్నకృష్ణ, ఆళ్ల అంజిరెడ్డి, జశ్వంత్, పాల్వంచ కృష్ణ, బాషా, వీరభద్రం, వా ంకుడోత్ వెంకన్న, ఇషాక్, బోజెడ్ల రా మ్మోహన్, నగేశ్ తదితరులు ఉన్నారు.