మధిర టౌన్, జూన్ 10: పట్టణ ప్రగతి కార్యక్రమంతో మధిరలో అభివృద్ధి పనులు పరుగు పెడుతున్నాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. స్థానిక 2వ వార్డులో పట్టణ ప్రగతి పనులను శుక్రవారం పరిశీలించారు. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి చెత్తను శుభ్రం చేశారు. మొక్కలకు నీళ్లు పట్టారు. స్థానికులతో ఆయన మాట్లాడుతూ.. గతంలో పోల్చుకుంటే రెండోవార్డు ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. మిగిలిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లతాజయాకర్, వైస్ చైర్పర్సన్ శీలం విద్యాలత, కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్లు సయ్యద్ ఇక్బాల్, యర్రగుంట లక్ష్మి, వైవి.అప్పారావు, శీలం వెంకటరెడ్డి, యర్రగుంట రమేష్, మేడికొండ కిరణ్, ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో మధిర అభివృద్ధి జరుగుతున్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మధిర ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్ మల్లాది వాసుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.
కూసుమంచి, జూన్ 10: మండలంలో శుక్రవారం పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చింతకాని, జూన్ 10: మండలంలో పల్లె ప్రగతి పనులను ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ పరిశీలించారు.
నేలకొండపల్లి, జూన్ 10: మండలంలోని కోనాయిగూడెం గ్రామంలో పల్లె ప్రగతి పనులను సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ పరిశీలించారు.