ఖమ్మం/ రఘునాథపాలెం/ ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 8: మంత్రి పువ్వాడ అజయ్ కృషితోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని నేతలు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో ఉన్న అనుబంధంతో మరిన్ని నిధులు తెచ్చి ఖమ్మంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకిరంచి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్ఎస్, అనుబంధ సంఘాలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో గురువారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలోనూ, వివిధ ప్రాంతాల్లోనూ వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ ప్రారంభించారు. టీఆర్ఎస్ యువజన విభాగం నేతలు దేవభక్తిని కిశోర్, మాటేటి కిరణ్‌కుమార్, బలుసు మురళీకృష్ణ, సరిపూడి గోపి సందేశ్, తౌసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ డౌలే లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, యువజన విభాగం నాయకుడు డౌలే సాయికిరణ్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు షేక్ ఉస్మాన్‌పాషా, మాడూరి సైదారావు తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఆ బ్యాంకు చైర్మన్ కూరాకుల నాగభూషణం కేక్ కట్ చేశారు. కేఎంసీ కార్యాలయంలో మేయర్ పునుకొల్లు నీరజ కేక్ కట్ చేశారు. డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, ముక్తార్, పగడాల శ్రీవిద్య, అమృతమ్మ, కృష్ణలాల్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ యువజన విభాగం నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ర్యాలీ నిర్వహించి కాల్వొడ్డులో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నగర ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ కృషి వల్లనే ఖమ్మం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. బలుసు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అల్లిపురంలో మంత్రి అజయ్ మూడేళ్ల పాలన సంబురాలు నిర్వహించారు. కార్పొరేటర్ రావూరి కరుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మంత్రి పువ్వాడ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం వినాయకుడి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రావూరి సైదుబాబు, సంక్రాంతి నాగేశ్వరరావు, ముప్పారపు ఉపేందర్‌రావు, మొర్రిమేకల కోటయ్య, సత్తి గోపాలరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.