ఆధ్యాత్మికతతోనే మనుషులు గొప్పవారవుతారు
ఆధ్యాత్మికతతోనే మనుషులు గొప్పవారవుతారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. బుధవారం మండలంలోని వందనం శివాలయంలో జరిగిన ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు వీడ్కోలు పలికారు.
- జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు
చింతకాని, డిసెంబర్ 14: ఆధ్యాత్మికతతోనే మనుషులు గొప్పవారవుతారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. బుధవారం మండలంలోని వందనం శివాలయంలో జరిగిన ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు వీడ్కోలు పలికారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప మాలధారులకు శబరిమల యాత్ర సజావుగా సాగాలని ఆకాంక్షించారు. తొలుత అయ్యప్ప మాలధారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, నాయకులు కొండపల్లి శేఖర్‌రెడ్డి, ఆవుల నాగేశ్వరరావు, కొరిపల్లి శ్రీను, మాలధారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
జడ్పీ చైర్మన్ చిర్యువ్యాపారుల కృతజ్ఞతలు
మధిరటౌన్, డిసెంబర్ 14: పట్టణంలోని రోడ్ల పక్కన ఉన్న చిరువ్యాపారుల షాపులు తొలగించారు. ఆ సమయంలో ఆందోళనకు గురైన చిరు వ్యాపారులకు స్థలం కేటాయిస్తామని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు హామీ ఇచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు చిరువ్యాపారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి అజయ్‌కుమార్, కలెక్టర్‌ను కలిసి వారికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలో మధిర మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో 80 మంది చిరువ్యాపారులకు స్థలం కేటాయించారు. తమ సమస్యను పరిష్కరించి అండగా నిలిచిన జడ్పీచైర్మన్ను బుధవారం మధిరలోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, నాయకులు బిక్కి ప్రసాద్, కరివేద సుధాకర్, కనుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, బీవీఆర్, వైవీ అప్పారావు, తొగరు ఓంకార్, మేడికొండ కిరణ్, చిరువ్యాపారుల సంఘం అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, వ్యాపారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

