ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు వచ్చాయి. వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 37, 38 మధ్య నమోదవుతున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం ఏసీలు, కూలర్లను వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వాడకం పెరిగిపోయింది. వారం రోజులుగా అత్యధికంగా 422 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. గతేడాదిలో ఇదే నెల కంటే ఈ సారి విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంది. జెన్కో జిల్లాకు రోజుకు 6.47 మిలియన్ యూనిట్ల కోటా కేటాయించగా.. ప్రస్తుతం రోజుకు సుమారు 7.80 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతున్నది.
వినియోగదారులు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తే వారికి విద్యుత్ బిల్లులతో ఆర్థిక భారం తగ్గుతుంది. ఒక యూనిట్ విద్యుత్‌ను ఆదా చేస్తే ఒక యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లే. సమాజానికి మేలు చేసినట్లే. ఒక్కో వినియోగదారుడు రోజుకు ఒక యూనిట్ విద్యుత్తును ఆదా చేస్తే తన జీవిత కాలంలో రూ.లక్ష ఆదా చేసినట్లే.
మామిళ్లగూడెం, మార్చి 9: వేసవి వచ్చేసింది.. ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీంతో నివాసాలు, వ్యాపార సముదాయాల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం అమాంతం పెరిగింది. మరోవైపు వ్యవసాయానికి విద్యుత్తు డిమాండ్ అధికంగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఉత్పత్తికి డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం సహజంగానే ఉంది. డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు టీఎస్ జెన్కో సంస్థ ఏటా కృషి చేస్తున్నది. అవసరమైతే ఇతర ప్రాంతాల్లో విద్యుత్ కొనుగోలు చేసి మరీ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుంది. ఇలాంటి సందర్భంలో వినియోగదారులు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తే వారికి విద్యుత్ బిల్లులతో ఆర్థిక భారం తగ్గుతుంది. అంతేకాదు ఒక యూనిట్ విద్యుత్‌ను ఆదా చేస్తే ఒక యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లే. సమాజానికి మేలు చేసినట్లే. ఒక్కో వినియోగదారుడు రోజుకు ఒక యూనిట్ విద్యుత్తును ఆదా చేస్తే తన జీవిత కాలంలో రూ.లక్ష ఆదా చేసినట్లే.
సౌర విద్యుత్తే ప్రత్యామ్నాయం..
విద్యుత్తు డిమాండ్‌ను కొంతమేరకు తగ్గించగలిగే సాధనం సౌర విద్యుత్తు మాత్రమే. సౌర విద్యుత్‌పై ఒకసారి పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి ఉచితంగా గృహాలు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. భవనాలు, ఖాళీ స్థలాలు, పంట పొలాల్లో అవసరమైన వారు సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైనంత విద్యుత్తు ఉపయోగించుకొని మిగిలింది విద్యుత్తు పంపిణీ సంస్థకు విక్రయించుకునే అవకాశమూ ఉంటుంది. సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తితో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. తద్వారా వాతావరణ కాలుష్యాన్నీ తగ్గించొచ్చు.
విద్యుత్ పొదుపు ఎంతో అవసరం..
జిల్లాలో అవసరాలకు సరిపడా విద్యుత్ గ్రిడ్ ద్వారా సరఫరా అవుతున్నది. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందకు ప్రభుత్వం నిరంతం కృషి చేస్తున్నది. వేసవిలో ఏసీలు, కూలర్ల వినియోగంతో డిమాండ్ పెరుగుతున్నది. వినియోగదారులు నాణ్యమైన ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగించి బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చు. విద్యుత్ పొదుపు ఆర్థికంగానూ, సమాజ హితం కోసమూ మంచిదే.
– ఎ.సురేందర్, ఎస్ఈ, టీఎస్ ఎన్పీడీసీఎల్, ఖమ్మం సర్కిల్
విద్యుత్ పొదుపు చేయండి ఇలా..