కారేపల్లి, జూలై 19 : ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో వైరా నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబురాలు శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, రుణాల బీమా, ప్రమాద బీమా చెక్కులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి, కొణిజర్ల, వైరా, జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు చెందిన అధికారులు, ఐకెపి సిబ్బంది, గ్రామ సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శిలతో పాటు డ్వాక్రా గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.