కారేపల్లి, నవంబర్ 11 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి పెద్ద చెరువు చేపల సొసైటీ నూతన సభ్యులకు మంగళవారం గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన పెద్ద చెరువు గిరిజన మత్స్యశాఖ సొసైటీ నూతన సభ్యులుగా 21 మంది అర్హత పొందారు. వారికి గేటు కారేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సభ్యత్వ కార్డులను గ్రామ పంచాయతీ సెక్రటరీ కె. అనూష, కారేపల్లి విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకుడు బానోతు రామ్మూర్తి, గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయిని తిరుపతయ్య, చెరుకూరు వెంకటేశ్వర్లు, జక్కుల కుమార్, బానోత్ నాగార్జున్, మత్య సొసైటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.