ఖమ్మం వ్యవసాయం, జూలై 27 : దశాబ్దాలుగా ఖతాదారులకు భద్రాద్రి బ్యాంకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి డాక్టర్ కృపాసాగర్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని వాసవిగార్డెన్లో భద్రాద్రి బా్ంయక్ 27వ వార్షిక మహాజన సభ బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది.
తొలుత వార్షిక నివేదికకు సంబంధించిన వివరాలను సభ ఎదుట ప్రసంగించారు. ముఖ్యఅతిథిలుగా హాజరైన జడ్జి కృపాసాగర్, జిల్లా సెషన్స్ జడ్జి రాజగోపాల్ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖర్షీద్, ఉదయ్ప్రతాప్, వెంకటేశ్వరరావు, భాస్కర్, రాజారావు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.