బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఖమ్మం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఊరూరా కేట్ కట్ చేసి.. స్వీట్లు పంపిణీ చేశారు. పండుగ వాతావరణంలో మొక్కలు నాటడం.. ఆస్పత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో రోగులకు, అనాథాశ్రమాల్లో వృద్ధులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనాథలకు దుస్తులు అందజేశారు. రక్తదానం చేశారు.

ప్రజలతో మమేకమై.. నిత్యం సమస్యలపై ప్రశ్నించే యువనేత కేటీఆర్ అని, రాష్ట్రంలో ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సాధించారని, ఆయన వెయ్యేళ్లు వర్థిల్లాలని పలువురు నాయకులు ఆశీస్సులు, దీవెనలు అందజేశారు. మధిరలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, దమ్మపేటలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఖమ్మంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

– నెట్వర్క్