అశ్వారావుపేట రూరల్, నవంబర్ 24: మండలంలోని వాగొడ్డుగూడెం, కొత్త కన్నాయిగూడెం, ఉసిర్లగూడెం, ఆసుపాక, దిబ్బగూడెం గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు సాధు జ్యోతి లక్ష్మీబాయి, గొంది లక్ష్మణరావు, మొడియం నాగమణి, కునసోతు లింగయ్య, లక్ష్మి అధ్యక్షతన గ్రామసభలు జరిగాయి. అధికారులు మాట్లాడుతూ దరఖాస్తు చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పోడు పట్టాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వివిధశాఖ అధికారులు రమేశ్‌బాబు, దుర్గారావు, వెంకటేశ్వరరావు, రేఖారాణి, పద్మావతి, మోతీలాల్, రోహిత్, విద్యాసాగర్, రమేశ్ పాల్గొన్నారు.
చండ్రుగొండ, నవంబర్ 24: అర్హులైన పోడు సాగుదారులందరికీ ప్రభుత్వం పోడు పట్టాలు మంజూరు చేస్తుందని ఎంపీవో తోట తులసీరాం అన్నారు. గురువారం పోకలగూడెం గ్రామంలో జరిగిన పోడు గ్రామసభలో ఆయన మాట్లాడారు. తొలుత గొత్తికోయల చేతిలో హత్యకు గురైన రేంజర్ చలమల శ్రీనివాసరావు మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు పట్టాలు మంజూరు చేస్తారన్నారు. గ్రామసభకు అటవీశాఖ సిబ్బంది గైర్హాజరయ్యారు. గ్రామసభలో సర్పంచ్ ఇస్లావత్ నిరోషా, గ్రామపంచాయతీ కార్యదర్శి శైలజ, తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి, నవంబర్ 24: మండలంలో టేకులపల్లి, బావోజితండా, దంతాలతండాల్లో సర్పంచుల ఆధ్వక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభలో స్పెషలాఫీసర్లు సీడీపీవో తార, ఎంపీడీవో బాలరాజు పాల్గొని గ్రామసభలో వచ్చిన అభ్యంతరాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమక్షంలో చర్చించారు. కార్యక్రమంలో సర్పంచులు కోరం ఉమ, బోడ సరిత, ఉపసర్పంచ్ సురేశ్, ఎంపీవో గాంధీ, వార్డు సభ్యులు నోముల భానుచందర్, తోటకూరి చిట్టమ్మ, రవిబాబు, పంచాయతీ కార్యదర్శి కిరణ్, అటవీ హక్కుల కమిటీ చైర్మన్ ధారావత్ సురేశ్, కార్యదర్శి బోడ బాలు, సునీల్, వీరభద్రం, పోడు రైతులు పాల్గొన్నారు.