పేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం : రాష్ట్ర హెల్త్ డైరక్టర్ రవీందర్‌నాయక్
పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హెల్త్ డైరక్టర్ రవీందర్‌నాయక్ అన్నారు. బుధవారం కారేపల్లి పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది విధుల గురించి..
కారేపల్లి, మే 27 : పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హెల్త్ డైరక్టర్ రవీందర్‌నాయక్ అన్నారు. బుధవారం కారేపల్లి పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది విధుల గురించి వైద్యాధికారి డాక్టర్ బి.సురేష్ ను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీ అప్‌గ్రేడ్, అందుబాటులో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న పలువురి విజ్ఞప్తిపై స్పందించిన హెల్త్ డైరక్టర్ జిల్లా, రాష్ట్ర అధికారులతో చర్చించి కారేపల్లి పీహెచ్సీలో సేవల కల్పనకు కృషి చేస్తానన్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన అనేకమంది పడుతున్నారన్నారు. వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తప్పని పరిస్ధితిలో మాత్రమే ఎండ నుండి రక్షణగా ఉండే దుస్తులు ధరించి బయటకు రావాలని సూచించారు.
పచ్చదనం లోపించడంతో రానురాను ఉష్ణోగ్రతలు పెరుగుతూ జీవజాతుల మనగడ కష్టంగా మారిందన్నారు. మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడంతోనే మానవనుగడ సాధ్యమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో వ్యయం చేస్తుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో లేకపోతే ముందుగానే ఇండెంట్ పెట్టి లోటు లేకుండా చూచుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు. హెల్త్ డైరక్టర్ వెంట డీఎంహెచ్‌వో రామారావు, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు నాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వేణు మాధవ్, కారేపలి మండల వైద్యాధికారి సురేష్, సూపర్వైజర్ సూర్యం ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

