వైరాటౌన్, డిసెంబర్ 4 : దళితుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ అన్నారు. 14వ వార్డులో తిరుమల టెంట్హౌస్ను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, దళితులంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.
కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, దిశా కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జున్రావు, కౌన్సిలర్ డాక్టర్ కోటయ్య, అప్పం సురేశ్, ఏదునూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.