ఆరు గ్యారెంటీలు వర్తింపజేయాలి
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఆరు గ్యారెంటీలు వర్తింపజేయాలని భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు.
- భద్రాద్రి జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఆరు గ్యారెంటీలు వర్తింపజేయాలని భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ, పెనగడప గ్రామాల్లో ఆయన ప్రజా పాలన గ్రామసభలను సందర్శించారు. దరఖాస్తుదారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు ఎవరైనా దరఖాస్తులు పూర్తి చేయడం మరిచిపోయినా వారికి చెప్పి మరీ పూర్తి చేయించాలన్నారు. శనివారంతో ముగియనున్న గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ అధికారులు ఆన్లైన్ చేస్తారన్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట మండల కేంద్రాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గ్రామసభలను సందర్శించారు. కలెక్టర్ ప్రియాంక ఆల గ్రామసభలను పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ రాంబాబు గ్రామసభల తీరును పరిశీలించారు. ఆయా మండలాల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు దరఖాస్తుల స్వీకరణలో లోటుపాట్లను గమనించి ఆన్లైన్ విధానంపై వివరించారు. మున్సిపాల్టీల్లో చైర్మన్లు, ప్రత్యేకాధికారులు గ్రామసభలను పగడ్బందీగా నిర్వహించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

