మధిర, అక్టోబర్ 03 : స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బొమ్మినేని తిరుపయ్య (98) కన్నుమూశారు. నైజాం నవాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాల్లో తిరుపయ్య పాల్గొన్నారు. ప్రజా రక్షణ కోసం సాయుధ పోరాట దళాలలో పాల్గొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. తిరుపయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తిరుపయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, కుటుంబ సభ్యులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి నివాళులర్పించారు.