కారేపల్లి, ఏప్రిల్ 13 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని టేకులగూడెం గ్రామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అభయాంజనేయ స్వామి, శిఖర, కలశ, ధ్వజ,శివలింగ, నంది, గణపతి ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారం మహా పూర్ణాహుతితో పరిసమాప్తి అయ్యాయి. విగ్రహమూర్తులకు పంచామృత స్నానాలు, యంత్ర ప్రాణ ప్రతిష్ఠ జపం, శ్రీ రుద్ర నమక చమక హోమం, బీజన్ వ్యాస ధాతున్యాస గర్తన్యాస యంత్ర ప్రతిష్ఠాపనలు, విగ్రహమూర్తులకు నేత్రో సమ్మేళనం, ధౌను దర్శనం కార్యక్రమాలు నిర్వహించారు. వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాసు నాయక్ ఉత్సవాలకు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు పగడాల మంజుల, స్థానిక నాయకులు బానోత్ దేవులనాయక్, బానోత్ రామ్మూర్తి నాయక్, దుగ్గినేని శ్రీనివాసరావు, నర్సింగ్ శ్రీనివాసరావు, పెద్దబోయిన ఉమాశంకర్, మేదర టోనీ, బండారు మోహన్రావు, బండారి రాములు, నాగేశ్వరరావు, పెద్దబోయిన ప్రశాంత్, ఎండీ.హనీఫ్, గుమ్మడి సందీప్ పాల్గొన్నారు.