బీబీనగర్ : మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి(Laxminarayana swamy) ఆలయంలో శనివారం గ్రామానికి చెందిన కొండూరి జ్యోతి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభిష్టి సిద్ధి లింగేశ్వర ఆలయంలో జరుగుతున్న సలహార నిర్మాణం, గణపతి, ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం గోపుర నిర్మాణం కోసం రూ. 50,116 వేల ఆర్థిక సహాయాన్ని ( Donations) అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కసిరెడ్డి ఇందిరా నారాయణరెడ్డి, నాయకులు చెరుకు అచ్చయ్య గౌడ్, మాజీ సర్పంచ్ అరిగే సుదర్శన్, మాజీ ఉప సర్పంచ్ కొండూరి వెంకటేష్ గౌడ్, బాల్ రాజ్, ఈవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.