కారేపల్లి : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి), కామేపల్లి మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు ( Thunder ) , పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి గ్రామ సమీపంలో మిరప తోటలో పనిచేస్తున్న రైతు గుగులోతు బావుసింగ్ ( Farmer Bavsingh ) పై పిడుగు పడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పక్కనే ఉన్న స్థానిక రైతులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
ఆరేపల్లి మండల పరిధిలోని మేకల తండా గ్రామం గూగులోతు మోహన్ రావుకు చెందిన ఆవు పిడుగుపడగా మృతి చెందింది. జిల్లాలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించిందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. ఎటువంటి సమస్యల ఉన్న స్థానిక పంచాయతీ కార్యదర్శులకు, సిబ్బందికు తెలియజేయాలన్నారు.