పెనుబల్లి, జనవరి 23 : కంటి వెలుగు కార్యక్రమం మహాఅద్భుతమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రామచంద్రరావుబంజరులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన అధికారులతో కలిసి సోమవారం పరిశీలించి మాట్లాడారు. నాణ్యమైన కళ్లజోళ్లను ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకునేలా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఆయన వెంట నాయకులు, ప్రజాప్రతినిధులు కావూరి మహాలక్ష్మి, పసుమర్తి వెంకటేశ్వరరావు, నర్సింహారావు, యలమర్తి శ్రీను, మరకాల చంటి, కోటా ప్రభాకర్, వెంకి తదితరులు ఉన్నారు.
వేంసూరు, జనవరి 23 : అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు అన్నారు. కంటివెలుగు శిబిరాన్ని ఎంపీవో రంజిత్కుమార్తో కలిసి సోమవారం పరిశీలించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటిపరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఇందుప్రియాంక, సీహెచ్‌వో వెంకటనారాయణ, కార్యదర్శి మమత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి, జనవరి 23 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో చంద్రశేఖర్ అన్నారు. అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ తులిశ్యాతండా, మాదారం గ్రామాల్లో కంటివెలుగు వైద్య శిబిరాలను సోమవారం ఆయన సందర్శించి మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో కంటివెలుగు వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారులు రంజిత్, శ్రేష్ట, సర్పంచ్‌లు అజ్మీరా నరేశ్, అరుణ, పీహెచ్ఎన్ సుధారాణి, సూపర్వైజర్లు పద్మ, సూర్యం, ఏఎన్ఎంలు శీలం శ్యామల, ఉండం రాధ, కృష్ణవేణి, చందన తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, జనవరి23 : బిల్లుపాడు, పినపాక గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో బీరెడ్డి రవీందర్‌రెడ్డి సందర్శించి పర్యవేక్షించారు. ప్రభుత్వం ప్రతిఒక్కరికీ కంటివెలుగు ప్రసాదించడమే లక్ష్యంగా కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అనంతరం పలువురికి కళ్లజోళ్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, సూపర్వైజర్ పెద్దపుల్లయ్య, సీహెచ్‌వో భాస్కర్, ఆరోగ్యసిబ్బంది పాల్గొన్నారు.