బాల్య వివాహాలు నిర్మూలించాలి
పెనుబల్లి, మే 5 : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్ రమాదేవి అన్నారు. గురువారం నిర్వహించిన బాల్య వివాహాల నిర్మూలన కమిటీ సమావేశంలో గోడపత్రులను ఆవిష్కరించి మాట్లాడారు. ఐసీడీఎస్ సీడీపీవో కృష్ణకుమారి, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, ఎస్సై సూరజ్, ఏసీడీపీవో మోహరున్నీషా బేగం, బీఎస్ మధులత, మహాలక్ష్మి, లక్ష్మీకాంతం పాల్గొన్నారు.
కల్లూరు, మే 5: : బాల్య వివాహాలు చట్టప్రకారం నేరమని ఎస్సై వెంకటేశ్ అన్నారు. గురువారం ఆయన కల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండకుండా వివాహాలు చేయవద్దని, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తప్పిదాలు జరగవని పేర్కొన్నారు.
వేంసూరు, మే 5 : 18 ఏళ్ల లోపు పిల్లలకు పెళ్లిళ్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలపై ఉందని తహసీల్దార్ రాగం ఎర్రయ్య అన్నారు. గురువారం వేంసూరు రైతు వేదికలో బాల్య వివాహాల నిషేధంపై నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను తల్లిదండ్రులకు వివరించడం ద్వారా అరికట్టవచ్చునన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, ఎంఈవో చలంచర్ల వెంకటేశ్వరరావు, సీడీపీవో కొండమ్మ, కార్యదర్శులు, సర్పంచ్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- abolished
- child marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

