మధిర, ఆగస్టు 13 : మాదక ద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత అని మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి.జయదాస్ అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం- సాధికారత శాఖ వారి ఆదేశానుసారం నాశ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపాల్ జయదాస్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీఓ తౌరియా, లత, సాంబయ్య, కృష్ణ, ఉపేందర్, విక్రమ్, నాగరాజు, లాలయ్య, కొండలరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.