‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట...
– పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల వరకు పరిహారం ఇవ్వాలి
– కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఐక్య రైతు సంఘం ధర్నా
కారేపల్లి, అక్టోబర్ 28 : తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఐక్య రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం తాసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోలేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కరువు మండలంగా ప్రకటించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా, క్షేత్రస్థాయిలో రైతులు, ప్రజలను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. వర్షాభావంతో పంటలు వేయలేని రైతులు, సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకలి బాధలను నివారించేందుకు రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
వర్షాభావం కారణంగా పంటలు సాగు చేయని భూములకు ఎకరానికి రూ.30 వేల పరిహారం, ఎండిపోయిన వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. బావుల కింద సాగవుతున్న కొద్దిపాటి పంటలనైనా కాపాడుకునేందుకు ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను రైతులకు అందుబాటులోకి తెచ్చి పంటలను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.కారేపల్లి మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం డివిజన్ కార్యదర్శి గుగ్గులోతు తేజ నాయక్, పార్టీ మండల కార్యదర్శి గుమ్మడి సందీప్, మండల నాయకులు పులకాని సత్తిరెడ్డి, రాకేష్, సక్రు, రంగయ్య, శ్రీను, అనసూయ, సరోజిని పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ప్రజలకు ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Hepatitis B | హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఆమోదం తెలిపిన అమెరికా ఎఫ్‌డీఏ..
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

