వంద శాతం డ్రైవింగ్ లైసెన్స్‌లున్న నియోజకవర్గమే లక్ష్యం
ఇకపై ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకే..
18 ఏళ్లు పైబడిన యువతీ యువకులు వినియోగించుకోవాలి
‘లైసెన్స్ మేళా’ ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్‌కుమార్
రఘునాథపాలెం, జూలై 7: ‘యువతీ యువకులు తప్పక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇకపై ఒక్కరు కూడా ప్రమాదాల బారిన పడొద్దు. వారి కుటుంబాలకూ ఆర్థిక ఇబ్బందులు కలిగించొద్దు. ఇందుకోసం వంద శాతం డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగి ఉన్న నియోజకవర్గంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారులతో కలిసి పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 10 వేల లైసెన్స్‌లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.
వంద శాతం డ్రైవింగ్ లైసెన్స్‌లుగా కలిగి ఉన్న నియోజకవర్గంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అందుకే ‘ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా’కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. సుమారు రూ.40 లక్షల సొంత నిధులు వెచ్చించి ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలోని పది వేల మంది యువతీ యువకులకు 10 వేల లైసెన్స్‌లకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారులతో కలిసి పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌ల మేళాను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియ దేశంలోనే చరిత్రాత్మకమని అన్నారు. నియోజకవర్గంలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులంతా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనేదే, ఇకపై ఏ ఒక్కరూ ప్రమాదాల బారిన పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడంతోపాటు జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందడంతోపాటు ప్రమాదాల రహిత ఖమ్మంగా తీర్చిదిద్దడంలో యువతీ యువకులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందేంత వరకూ క్యాంపు కార్యాలయంలో లైసెన్స్ మేళా కొనసాగుతుందన్నారు.
తల్లిదండ్రులు సహకరించాలి..
18 ఏళ్లు నిండిన తమ పిల్లలు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా తల్లిదండ్రులు సహకరించాలని మంత్రి కోరారు. సెలవురోజుల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ తన క్యాంపు కార్యాలయంలో ఈ మేళా ఉంటుందని, వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొందిన తరువాతే మేళాను ముగిస్తామని వివరించారు. ఆ దిశగా డివిజన్లలో కార్పొరేటర్లు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పలువురు యువతీ యువకులకు లెర్నింగ్ లైసెన్స్‌లను మంత్రి అందజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తోట కిషన్‌రావు, వరప్రసాద్, రామారావు, నీరజ, విజయ్‌కుమార్, ఆర్జేసీ కృష్ణ, నాగరాజు, కృష్ణ, జ్యోతిరెడ్డి, యల్లయ్య, మాధవరావు, కోటి, మోహన్‌రావు, ఉపేందర్, మల్లేశం, తిరుమలరావు పాల్గొన్నారు.