చింతకాని, సెప్టెంబర్ 12: పకడ్బందీగా ఓటరు జాబితా రికార్డు చేయలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత గురువారం అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితా కంప్యూటరీకరణ కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే పంచాయతీ ఎన్నికల కోసం పల్లె యూనిట్‌గా తీసుకొని ఓటరు జాబితా వివరాలు పొరపాట్లు జరుగకుండా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీవో రాంబాబు, ఎంపీబీవో రేబెల్లి రామయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 12: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో డీపీవో ఆశాలత మండలంలోని అన్ని గ్రామాల ఓటర్ల జాబితాలను పరిశీలించారు. అనంతరం కార్యదర్శులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎల్పీవో రాంబాబు, ఎంపీడీవో సురేంద్రనాయక్, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
బోనకల్లు, సెప్టెంబర్ 12: స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీరాజ్ అధికారి(డీపీవో) ఆశాలత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులను, పంచాయతీల వారీగా ఓటర్ లిస్ట్‌ల తయారీకి, సంబంధించిన వివరాలను పరిశీలించారు. అనంతరం జానకీపురం, రావినూతల పంచాయతీలను సందర్శించి గ్రామాల్లో కంపోస్ట్ షెడ్ వద్ద తయారు చేస్తున్న కంపోస్టు ఎరువులను ఆమె పరిశీలించి పంచాయతీ కార్యదర్శులకు సూచనలు, సలహాలు అందించారు. ఈమె వెంట డీఎల్పీవో రాంబాబు, ఇన్చార్జి ఎంపీడీవో కోటేశ్వరశాస్త్రి, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.