కారేపల్లి, జూన్ 24 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఖమ్మం పట్టణానికి చెందిన పెనుగొండ వరప్రసాదరావు తన మనవరాలు యశ్న పుట్టినరోజును పురస్కరించుకుని మంగళశారం నోట్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. యశ్న తల్లిదండ్రులు దీప్తి, శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అజ్మీర పద్మ చేతులు మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.బాసు, శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, కమల, ఉమామహేశ్వరావు పాల్గొన్నారు.