పాల్వంచ, సెప్టెంబర్ 19: కాంగ్రెస్వన్నీ మభ్య పెట్టే హామీలేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇటీవల పార్టీ నేతలు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలెవరూ విశ్వసించడం లేదని స్పష్టం చేశారు. అభివృద్ధిని గమనించిన ప్రజలు, పథకాలు అందుకున్న లబ్ధిదారులకు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని అన్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లను సాధిస్తుందని స్పష్టం చేశారు. దీంతో మరోమారు సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసకాలనీ, కుంటినాగులుగూడెం, కొత్తూరు, గుడిపాడు, బంగారుజాల ప్రాంతాల్లో రూ.20 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తే రాష్ట్రం అంధకారంలో మగ్గడం ఖాయమని, పాత రోజులు రావడం తథ్యమని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఇటీవల ప్రత్యేకంగా రూ.215 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. మొత్తంగా నియోజకవర్గంలోత రూ.3 వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, స్వామి, మురళి, రాజేశ్, ముంతపురి రాజుగౌడ్, ఎస్వీఆర్కే ఆచార్యులు, కాంపెల్లి కనకేశ్, సీతారాంబాబు, మల్లెల శ్రీరామ్మూర్తి, కాల్వ ప్రకాశరావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దాసరి నాగేశ్వరరావు, కందుకూరి రాము, దారా చిరంజీవి, పులి సత్యనారాయణ, సమ్మయ్య, దూళిపాల కుమారస్వామి, చల్లగుండ్ల వీరభద్రం, ఆరెం ప్రశాంత్, రేనాటి శ్రీను, ఊకే భద్రయ్య, ఆరుట్ల లక్ష్మణాచారి, కొర్సా దశరాజు, కుర్సం రమేశ్, సువ్వారపు వెంకటేశ్వరరావు, బండి చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.