ఖమ్మం జిల్లాపై ‘అర్నబ్’ తుపాను ప్రభావం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడంతో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాపైనా కనిపిస్తున్నది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా బలమైన ఈదురుగాలులు వీచగా.. గురువారం తెల్లవారుజాము నుంచి తేలికపాటి జల్లులు ప్రారంభమయ్యాయి.
ఖమ్మం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడంతో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాపైనా కనిపిస్తున్నది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా బలమైన ఈదురుగాలులు వీచగా.. గురువారం తెల్లవారుజాము నుంచి తేలికపాటి జల్లులు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల తర్వాత ఖమ్మం నగరంతోపాటు జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
వర్షం కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు చాలా రోజుల తర్వాత వర్షం కురుస్తుండటంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
పత్తి, వరి రైతుల్లో ఆందోళన
జిల్లాలో వానాకాలం సాగులో ప్రధాన పంటలైన పత్తి, వరి ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. వరి కోతలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న రైతులు వర్షం తీవ్రత పెరిగితే పంటకు నష్టం వాటిల్లుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో భారీ వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
పత్తి రైతుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. పత్తి ఏరుకునే సమయంలో వర్షాలు కురిస్తే పంట నాణ్యత దెబ్బతినడంతోపాటు దిగుబడిపైనా ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం ఎంతకాలం కొనసాగుతుందో తెలియక రైతులు పరిస్థితిని గమనిస్తున్నారు.
మరోవైపు పంటలకు చివరి తడి అవసరమైన రైతులకు ఈ వర్షం కొంత ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొన్న పంటలకు తగినంత నీరు అందితే మేలు జరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఒకవైపు వర్షం పంటలకు ఉపయోగపడుతుందనే ఆశ ఉన్నప్పటికీ.. మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతింటాయేమోననే ఆందోళన నెలకొంది.
తుపాను ప్రభావంపై ఉత్కంఠ
‘అర్నబ్’ తుపాను తీరం దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ ప్రభావం ఖమ్మం జిల్లాపైనా ఉండవచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినట్లు సమాచారం. వర్షాలు మరింత పెరిగితే పంటలపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖమ్మం జిల్లాపై ‘అర్నబ్’ తుపాను ప్రభావం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
Ramya Krishna | తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్‌కు ఎంత పారితోషికమంటే?
Water Crisis | ఏదులాపురంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా బంద్.. కాలనీవాసుల అవస్థలు!
Pyare Miyan: మైనర్ అమ్మాయిల రేప్.. నిందితుడికి 10 జీవితకాల శిక్షలు
Red alert | అర్నాబ్ తుఫాన్ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

