మధిర, ఆగస్టు 28 : గత రెండు రోజులుగా కురుస్తున్న తుఫాన్ కారణంగా మధిర నియోజక వర్గంలోని వాగులు, చెరువులు, మున్నేరులు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతున్నాయి. వరద కారణంగా చింతకాని, బోనకల్లు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. బోనకల్లు మండలంలోని పెద్ద వీరవల్లి, జానకిపురం, చిన్న బీరవల్లి గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పొలాలు వరద నీటికి పూర్తిగా మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ముష్టికుంట్ల, బోనకల్లు, రావినూతల గ్రామాల్లో పత్తి పైర్లు వరద నీటిలో మునిగాయి. చింతకాని మండలంలో ఖమ్మం- బోనకల్లు ప్రధాన రహదారిలో కృష్ణాపురం వద్ద ఉన్న కల్వర్టు పైనుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ఈ కారణంగా ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.
Madhira : వరద ఉధృతికి నీట మునిగిన పంట పొలాలు
Madhira : వరద ఉధృతికి నీట మునిగిన పంట పొలాలు