రఘునాథపాలెం, డిసెంబర్ 24: అభివృద్ధి పథంలో పయనిస్తున్న ఖమ్మం జిల్లావాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకే ‘క్రేడాయ్’ నగరంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నదని క్రేడాయ్ ఆల్ ఇండియా సెక్రటరీ జీ రామిరెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆదివారం ఆయన ప్రాపర్టీ షోను ప్రారంభించి మాట్లాడారు. ఇంత చక్కటి అవకాశాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సంస్థ జిల్లా అధ్యక్షుడు బండి జయకిషోర్తో కలిసి స్టాళ్లను పరిశీలించారు.
ప్రాపర్టీ షోలో ఖమ్మంతో పాటు హైదరాబాద్‌కు చెందిన అనేక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, హౌజింగ్, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనేక కంపెనీలు 70కిపైగా స్టాళ్లు ఏర్పాటు చేశాయి. అర్హులైన వినియోగదారులకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్లూ స్టాళ్లు నిర్వహించారు. నిర్వాహకులు గంట గంటకూ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రాపర్టీ షోలో క్రేడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, కోశాధికారి జగన్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది కేశవరావు, కోశాధికారి చెరుకుమల్లి వెంకటేశ్వరరావు, ఇతర ప్రతినిధులు సురేశ్, కొప్పు నరేశ్, కృష్ణమోహన్, రంగారావు, వీరయ్య, శ్రీనివాస్, కిశోర్‌కుమార్, నగేశ్, ఉమేశ్, నారాయణరావు, సైదుబాబు, మురళి పాల్గొన్నారు. సోమవారం జరిగే ముగింపు సభకు రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.