కారేపల్లి, అక్టోబర్ 23 : ఇల్లెందు మార్కెట్ కమిటీ పరిధిలోని ముచ్చర్ల చెక్‌పోస్ట్ వద్ద పత్తి తేమ శాతం కొలుచే మిషన్ ఏర్పాటు చేసినట్లు ఇల్లెందు మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి పత్తి రైతుల సౌకర్యార్థం ముచ్చర్ల చెక్ పోస్ట్ నందు ఏర్పాటు చేసిన మాయిశ్చర్ మీటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీసీఐలో పత్తి అమ్మడానికి వెళ్లే రైతులు పత్తి తేమ శాతంను ముచ్చర్ల చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేసుకోవచ్చన్నారు. తేమ శాతం వచ్చిన తర్వాతనే సిసిఐ కేంద్రానికి పత్తిని తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.