మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును పోలీసులు అక్రమ అరెస్ట్‌ను; బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, అతడి అనుచరులు, కాంగ్రెస్ గూండాల దాడిని నిరసిస్తూ ‘చలో హైదరాబాద్’కు శుక్రవారం ఉదయం బయలుదేరిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. సత్తుపల్లి, మధిర, వైరా పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ గూండాలు అకారణంగా దాడులు చేస్తే పట్టించుకోని పోలీసులు.. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్తున్న తమను ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
భద్రాచలంలో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ గూండాలు సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతో తమ పార్టీ నేతలపై అకారణంగా దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
-సత్తుపల్లి/ వైరా టౌన్/ మధిర/చింతకాని/ఇల్లెందు రూరల్/ ఎర్రుపాలెం, సెప్టెంబర్ 13
ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే నేతల ఇళ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. సత్తుపల్లిలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కౌన్సిలర్లు అద్దంకి అనిల్, చాంద్‌పాషా, గుండ్ర రాఘవేంద్రరావు, బీఆర్ఎస్ నాయకులు మేకల నరసింహారావు, నడ్డి ఆనందరావు, అబ్దుల్లా, జొన్నలగడ్డ కృష్ణ తదితరులను, మధిరలో బీఆర్ఎస్ నాయకులు మొండితోక జయాకర్, రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, అప్పారావు, కొండా తదితరులను, చింతకానిలో బీఆర్ఎస్ నాయకులు పెంట్యాల పుల్లయ్య, గడ్డం శ్రీనివాసరావు,
గురజాల హనుమంతరావు, బొడ్డు వెంకట్రామారావు, పిన్నెల్లి శ్రీనివాస్, పొనుగోటి రత్నాకర్, పర్చగాని ఏడుకొండలు, నన్నక నర్సింహారావు, జానీమియా తదితరులను, వైరాలో బీఆర్ఎస్ నాయకులు కట్టా కృష్ణార్జున్‌రావు, వనమా విశ్వేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, ఏదునూరి శ్రీనివాసరావు, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, అప్పం సురేష్, దొంతెబోయిన గోపి, ఆదూరి ప్రేమ్‌కుమార్, వజినేపల్లి చక్రవర్తి, యండ్రాతి గోపాలరావు, కారుకొండ బోస్, తోటకూర వీరబాబు, సింగారపు నరేశ్ తదితరులను, ఎర్రుపాలెంలో బీఆర్ఎస్ నేతలు సాంబశివరావు, మస్తాన్‌వలీ, మల్లికార్జున్‌రెడ్డి, కిశోర్‌బాబు, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, కత్తి రవి, షేక్ బాజీ తదితరులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
ప్రతిపక్షం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతోందని, నిలదీస్తే దాడులు చేయిస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడి, మాజీ మంత్రి హరీశ్‌రావు అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఇల్లెందులో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిలివేరు సత్యనారాయణ మాట్లాడుతూ.. దౌర్జన్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని స్పష్టం చేశారు. ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ భావ్‌సింగ్‌నాయక్, జేకే శ్రీనివాస్, తోట లలిత శారద, పరుచూరి వెంకటేశ్వర్లు, నెమలి ధనలక్ష్మి, కొక్కు సరిత, జబ్బార్, నభి, గిన్నారపు రాజేశ్, హరికృష్ణ, ఆదూరి రవి, హరిప్రసాద్, కావేటి రమేశ్, వాసు, కిరణ్, చాంద్‌పాషా, సురేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసామ్యయుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అన్నారు. చింతకాని మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ పార్టీకి అరెస్టులు కొత్తకాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీను, బొడ్డు వెంకట్రామారావు, గురజాల హనుమంతరావు, పిన్నెల్లి శ్రీను, పొనుగోటి రత్నాకర్, నన్నక నర్సింహారావు పాల్గొన్నారు.